Home / SLIDER / తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగుల కోసం ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ , తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది సువర్ణావకాశం. ఇరిగేషన్, ఆర్ డ్ం బి శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియెరెన్స్ ఇచ్చింది. ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్) లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ( ఆర్ అండ్ బి, ఎన్. హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్ యూబీ ఎస్, హెచ్ వోడీ) లో284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వ ర్క్స్ అక్కౌంట్స్ హెచ్ వోడీ లో 53 , డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ( హెచ్ వోడీ) లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది.మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar