కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వాడకూడని కొన్ని పదాలంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్ నిషేధించింది. ఈ నేపథ్యంలో మీరు వాడే భాష ఇదా? అంటూ కొన్ని కామెంట్లను పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన ‘80-20’ ఓకేనా? మహాత్మా గాంధీని భాజపా ఎంపీ కించపరిచిన తీరు బాగానే ఉందా? రైతు నిరసనకారులను ఉగ్రవాదులు అని అవమానించడం సరైందేనా..?‘గోలీ మారో..’ అంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం..’’ ఇవన్నీ సరైనవా..? అని పేర్కొంటూ ఇన్‌డైరెక్ట్‌గా ప్రధాని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు.
‘సిగ్గు చేటు’, ‘వేధించడం’, ‘మోసగించడం’, ‘అవినీతిపరుడు’, ‘డ్రామా’, ‘హిపోక్రసీ’, ‘నియంత’ తదితర పదాలను ఉపయోగించకూడదని పేర్కొంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్ ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు.