సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (senior citizens) రాయితీని పునరుద్ధరించబోమని స్పష్టంచేసింది. కొవిడ్ పరిస్థితులు నేపథ్యంలో అన్ని రాయితీలనూ (Railway concession) రద్దు చేసిన రైల్వే శాఖ.. కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీల ప్రకటన చేసింది. గతంలో కొనసాగించిన అన్ని రాయితీలనూ తిరిగి పునరుద్ధరించే యోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టికెట్ రాయితీ గురించి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది
