టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పమని కాఫీ విత్ కరణ్ షోలో ఎదురైన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు.. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చరణ్ ఒక OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్), బన్ని ఓ మ్యాజిక్ అని చెప్పింది. తమిళ స్టార్ ధనుష్ గురించి చెప్పమని అడగ్గా.. అతడో గ్లోబల్ స్టార్ అని సామ్ చెప్పింది. ఇదే షోలో సామ్ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు విషయాలు వెల్లడించింది.
