భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు.
ఈ నెల 8వ తేదీ నుంచి 2 వారాలపాటు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ప్రతిపాదనలను కేశవరావు కమిటీ సిద్ధం చేసింది. ఈ కమిటీతో నేడు కేసీఆర్ సమావేశం కానున్నారు. కమిటీ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కార్యాచరణను ఖరారు చేస్తారు.