Home / SLIDER / పాడి కౌశిక్ దెబ్బకు తోక ముడిచిన ఈటల

పాడి కౌశిక్ దెబ్బకు తోక ముడిచిన ఈటల

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో  హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిపై చ‌ర్చ‌కు రావాల‌ని ఈట‌ల రాజేంద‌ర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స‌వాల్ విసిరిన విష‌యం విదిత‌మే. కౌశిక్ రెడ్డి స‌వాల్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తోక ముడిచారు. ఈట‌ల బ‌హిరంగ చ‌ర్చ‌కు రాకుండా.. వెనుక‌డుగు వేశారు.

ఈట‌ల రాజేంద‌ర్‌కు స‌వాల్ విసిరిన మేర‌కు టీఆర్ఎస్ శ్రేణుల‌తో క‌లిసి పాడి కౌశిక్ రెడ్డి శుక్ర‌వారం ఉద‌యం హుజురాబాద్ ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాకు చేరుకున్నారు. అక్క‌డ అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం పాడి కౌశిక్ రెడ్డి ఈట‌ల రాజేంద‌ర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

హుజురాబాద్‌లో కాకుండా గ‌జ్వేల్‌లో పోటీ చేస్తాన‌ని ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించుకుంటాడు. ఎవ‌డు ప‌డితే వాడు అక్క‌డ ఇక్క‌డ‌ పోటీ చేస్తామ‌ని చెప్ప‌డానికి వీల్లేద‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చెప్తాడు. మీ నాయ‌కుడే నీ మాట‌ల‌ను ప‌రిగ‌ణించ‌డం లేదు.. నీ మాట‌ల‌ను జోక‌ర్ మాట‌ల్లా చూస్తున్నారు. అందుకే నిన్ను జోక‌ర్ అన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar