తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న తన అభిమానులను ఉద్ధేశిస్తూ ట్విట్టర్ సాక్షిగా కొన్ని సూచనలు చేస్తూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం భారీగా వర్షాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. పనులు పూర్తిచేసుకొని తిరిగి ఇళ్లకు చేరే సమయంలో, వర్షంలో బైక్ నడిపే సమయంలో ప్లీజ్.. జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ఇళ్లకు చేరాలని సూచిస్తూ నేషనల్ క్రష్ రష్మికా ట్వీట్ చేసింది.
