ఏపీ విద్యార్థులకు శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా తదుపరి విడత నిధులను రేపు గురువారం విడుదల చేయనుంది. ఈ నెల 11న బాపట్ల పర్యటనకు వెళ్లనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే 10.85 లక్షల మంది విద్యార్థులు తమ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజును ప్రభుత్వం వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.