తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో.. అక్కినేని వారసుడు.. నవమన్మధుడు నాగచైతన్య, అందాల రాక్షసి.. వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్న కుర్రకారు అభిమాన దేవత కృతిశెట్టి జోడీగా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ మూవీ రూపొందనుంది.
ఈ చిత్రం చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ అని ఆ చిత్రం మేకర్స్ తెలిపారు. ‘ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో చైతన్య విభిన్నమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈనెల మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజు సంగీతం అందిస్తున్నారు’ అని పేర్కొన్నారు.