ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారు..ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీలా వైసీపీ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని బాబు ప్రశ్నించారు.