Home / MOVIES / నక్కతోక తొక్కిన కియారా అద్వాణీ

నక్కతోక తొక్కిన కియారా అద్వాణీ

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యంగ్ టైగర్ ..జూనియర్ ఎన్టీఆర్‌ ,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి మనందరికి తెలిసిందే.

అయితే  ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ముందుగా దివంగత సినీయర్ నటి శ్రీదేవి తనయ ..హీరోయిన్ జాన్వీ కపూర్‌ అన్నారు. ఆ తరవాత నేషనల్ క్రష్  రష్మిక పేరు బయటకు వచ్చింది.

అక్కడతో ఆగకుండా ‘సీతారామం’లో సీతగా మెప్పించిన మృణాల్‌ ఠాకూర్‌కి ఆ ఛాన్స్‌ వచ్చిందని చెప్పారు. అయితే.. వీళ్లెవరూ ఖాయం కాలేదని టాక్‌. ఇప్పుడు కొత్తగా కియారా అద్వాణీ పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్‌తో కియారా జోడీ కట్టడం దాదాపు ఖాయం అన్నది లేటెస్ట్‌ టాక్‌.

ఇదే నిజమైతే.. ఎన్టీఆర్‌ – కియారాల కాంబోలో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. కొరటాల శివ ఇది వరకు తెరకెక్కించిన ‘భరత్‌ అనే నేను’లో కియారానే నాయిక. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ తరవాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా ఇది. కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat