Home / MOVIES / కాజల్  , త్రిష  , తమన్నా సరసన కృతిశెట్టి

కాజల్  , త్రిష  , తమన్నా సరసన కృతిశెట్టి

 మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన  ఉప్పెన   అనే సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించిన కృతి శెట్టి   ఇప్పుడు వరస ప్లాప్ లను చవి చూస్తోంది. ఈమధ్య విడుదల అయినా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’   అన్న సినిమా కూడా ప్లాప్ అవటం వరసగా మూడో సారి.

అయినా కూడా కృతి శెట్టి ఏమాత్రం తగ్గటం లేదు. పెద్ద సినిమాలే చేతిలో వున్నాయి. నాగ చైతన్య  తో ఒక సినిమా చేస్తోంది ఇప్పుడు, అది షూటింగ్ కూడా మొదలయ్యింది. అలాగే  సూర్య  తో ఒక సినిమా అగ్రిమెంట్ చేసుకుంది, అది షూటింగ్ కూడా కొంచెం అయి ఇప్పుడు ఆగిందని, మళ్ళీ అది మొదలవుతుందని తెలిసింది. అలాగే సూర్య తమ్ముడు కార్తీ తో కూడా కృతి శెట్టి   ఒక సినిమా చేయనుంది అని తెలుస్తోంది.

కార్తీ   తో సినిమాకి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని, అది కన్ఫర్మ్   అయిపోతుందని అంటున్నారు. ఈ సినిమా కూడా కన్ఫర్మ్ అయితే కృతి శెట్టి ఇద్దరు అన్నదమ్ములతో చేస్తున్న నటిగా పేరు చేరుతుంది. ఇంతకు ముందు కాజల్  , త్రిష  , తమన్నా  , ఇంకా మరికొంతమంది  నటీమణులు ఈ ఇద్దరు అన్నదమ్ములతో చేసినవారే. ఇప్పుడు కృతి శెట్టి కూడా ఆ కోవలోకే వస్తుంది ఈ రెండు సినిమాలతో. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat