తండ్రి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు పెట్టడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్ స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందెవరు?. ఎన్టీఆర్‌ను ప్రజలకు దూరం చేసిందెవరు? పార్టీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ నవ్వుతూ నిలబడలేదా? మీ కుటుంబంలో బాబు పెట్టిన చిచ్చు మర్చిపోయావా బాలయ్యా? చంద్రబాబు చేసిన ద్రోహంపై ఏరోజైనా మీరు మాట్లాడారా?’ అని జోడి రమేష్ సూటిగా ప్రశ్నించారు.
ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టిన ఘనత సీఎం జగన్‌దేనని.. అధికారంలో ఉండి ఏరోజైనా బాబు దీని గురించి ఆలోచించారా? అని ఆయన నిలదీశారు. ‘మీరు అసలైన శునకాలు. ఎన్టీఆర్ కుమారులైనా పరమశుంఠలు. అసెంబ్లీకి బాలకృష్ణ ఎందుకు రాలేదు?. ఎంగిలి మెతుకులు కోసం చంద్రబాబు పంచన చేరిన మీకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని బాలకృష్ణను ఉద్దేశించి జోగి రమేష్ నిప్పులు చెరిగారు.