Home / SLIDER / సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి ఉచిత బియ్యం పంపిణి

సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి ఉచిత బియ్యం పంపిణి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో నేటి నుండి రాష్ట్రంలో మరోవిడత మనిషికి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్. ఈమేరకు నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలు తెలియజేసారు.రాష్ట్రంలో మొత్తం 90.01 కోట్ల కార్డులు, 283.42 లక్షల లబ్దీదారులున్నారని వీరిలో కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు మాత్రమే కేవలం 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుందన్నారు.

వీరికి అదనపు బియ్యంతో పాటు మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తుందన్నారు మంత్రి గంగుల. ప్రస్థుతం కేంద్ర ప్రభుత్వం మరో విడత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల కాలానికి PMGKAY పథకాన్ని పొడిగించిందని ఇందుకోసం కేవలం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అధనంగా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుందన్నారు. వీటికి నెలకు 75.75 కోట్ల చొప్పున రాబోయే మూడు నెలల్లో అధనంగా 227.25 కోట్లు రాష్ట్రం ఖర్చు చేస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.

PMGKAY మొదలైనప్పటి నుండి అధనంగా 25 నెలలకు 1308 కోట్లు ఖర్చు కేవలం బియ్యం కోసం చేసామని ఇవేకాకుండా వలసకూలీలకు 500, ప్రతీ కార్డుకు 1500 చొప్పున రెండునెలలు అందజేసిన వ్యయం 2,454 కోట్ల రూపాయలన్నారు, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయంతో రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ కడుపునిండా బోజనం తింటున్నారన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat