Home / SLIDER / బీఆర్ఎస్ జాతీయ పార్టీగా సీఈసీ ఆమోదిస్తుందా..?

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా సీఈసీ ఆమోదిస్తుందా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నాటి ఉద్యమ పార్టీ.. నేటి అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి  ను  జాతీయ పార్టీగా మారుస్తూ భారతరాష్ట్రసమితి అని పేరు మార్చిన సంగతి విదితమే. బీఆర్ఎస్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ  పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి బీఆర్‌ఎస్‌గా గుర్తించాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేయనున్నారు. అసలు జాతీయ పార్టీ అంటే ఏమిటి? ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి తేడా ఏమి టి? .ఈ క్రమంలో ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏయే నిబంధనలు అనుసరించాలన్న దానిపై ఎన్నికల కమిషన్‌ ఏం చెప్తున్నదో ఒక లుక్ వేద్దాం .

ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడానికి ముందున్నవి మూడు మార్గాలు.. అవి

ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ క్రింది మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి.
1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్‌ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు గెలువాలి.
2. ఏవైనా నాలుగు రాష్ర్టాల నుంచి 11 లోక్‌సభ సీట్లు (రెండు శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం మూడు రాష్ర్టాల నుంచి ఎన్నికవ్వాలి.
3. కనీసం నాలుగు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకొనే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.

అయితే  హోదా శాశ్వతం కాదు
జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే ఆ హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి హోదా ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. ఈ కారణంగానే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య తరుచూ మారుతున్నది.

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ కింది నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పాటించాలి.

  • రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలు గెలవాలి.
  •  ఆ రాష్ర్టంలో లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో పోలై, చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతోపాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.
  • ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
  • ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
  • లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై, చెల్లిన ఓట్లలో 8% వచ్చి ఉండాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat