Home / SLIDER / బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బెంగాల్ టైగర్.. దాదా అని ముద్దుగా పిలుచుకుని టీమిండియా లెజండ్రీ మాజీ కెప్టెన్.. ఆటగాడు సౌరవ్ గంగూలీ కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండబోతున్నాడని క్రికెట్ అభిమానులకు తెల్సిన విషయం.

ఆ తర్వాత తిరిగి ఈ పదవికి మళ్లీ దాదా పోటి చేసే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో దాదా స్థానంలో మరోకర్ని నియమించడం ఖాయమన్పిస్తుంది.1983 ప్రపంచ కప్ హీరో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా నియామకం కావడం అని చర్చనీయాంశమైంది.

ఈనెల పద్దెనిమిది తారీఖున జరిగే ఎన్నికలు,వార్షిక సర్వసభ్య సమావేశంలో ఓటర్ల జాబితాలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం తరపున రోజర్ బిన్నీ పేరుండటమే ఈ వార్తలకు బలం చేకూర్చే అంశం.  అయితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవికీ పోటిపడతాడు..

జైషా బీసీసీఐ కార్యదర్శిగానే కొనసాగుతాడని కథనాలు విన్పిస్తున్నాయి. అయితే బోర్డు ఎన్నికలకు ఈ నెల పదకొండు.. పన్నెండో తారీఖున నామినేషన్లు దాఖలు చేయవచ్చు.. దీంతో ఒకవేళ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అయితే దాదా ఐసీసీ చైర్మన్ అవ్వోచ్చన్నమాట. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat