సీనియర్ నటుడు.. హీరో.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD లో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హాటెస్ట్ అందాల బ్యూటీ శ్రీలీల. ఆ మూవీ హిట్ సాధించకపోయిన కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం పేరు ప్రఖ్యాతలు.. విమర్షకుల నుండి ప్రశంసలు సైతం వచ్చాయి. తాజాగా ఈ హాటెస్ట్ హీరోయిన్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ధమాకాలో నటిస్తుంది. అయితే శ్రీలీల నక్క తోక కాదు నక్కనే తొక్కినట్లు ఉంది.
అందుకే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది. యంగ్ హీరో నితిన్ హీరోగా ఓ మూవీలో.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో.. నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తున్న మరో మూవీలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. మరోవైపు సీనియర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న ఇంకో మూవీలో ప్రధాన కథానాయకిగా ఎంపికైనట్లు తెలుస్తుంది.
దీంతో తాను నటించిన పెళ్ళి సందD మూవీ హిట్ సాధించకపోయిన కానీ ఆ మూవీలో తనకే సొంతమైన అమాయకపు నటనతో.. మతిపొగొట్టే అందచందాలతో వయ్యారాలను ఆరబోస్తూ అందరి మదిలో స్థానం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస ఆఫర్స్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న శ్రీలీల ను శ్రీలీల ఏంటి నీలీల అని ఫిల్మ్ నగర్లో గుసగుసలాడుకుంటున్నారు.