తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాటెస్ట్ టాపిక్ ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం అయితే రెండోది మునుగోడు ఉప ఎన్నికలు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి విదితమే. ఈ నెల ఏడో తారీఖు నుండి నామినేషన్లు స్వీకరణ.. వచ్చే నెల మూడో తారీఖున పోలింగ్.. ఆ తర్వాత అదే నెల ఆరో తారీఖున ఆరో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. ఈక్రమంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి.. బీజేపీ పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక.. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ప్రభుత్వం తన నియోజకవర్గానికి నిధులివ్వకుండా అభివృద్ధికి నిరంతరం అడ్డుతగులుతుందనే బాధతో ఆత్మగౌరవం కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నాను మొదట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉకదంపుడు ప్రసంగాలు చేసిన సంగతి విదితమే. అయితే అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ … ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు వేల కోట్ల కాంట్రాక్టు పనుల కోసమే కోమటిరెడ్డి బీజేపీలోకి వెళ్లారు అని చేస్తున్న ప్రధాన ఆరోపణ.
అయితే తనపై వస్తున్న ఆరోపణలను మీడియా సాక్షిగా ఒప్పుకుని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు నామినేషన్ వేయకముందే అడ్డంగా బుక్కయ్యారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఓ ప్రముఖ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కోమటిరెడ్డి మాట్లాడుతూ “తాను మూడేండ్ల కిందట నుండే బీజేపీలో చేరతాను అని చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ఆరు నెలల కిందటనే పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్టు పనులను కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీ తనకు చెందిన కంపెనీకు అప్పజెప్పింది. అందుకే తాను బీజేపీలో చేరాను అని “పార్టీ మార్పు వెనక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. దీంతో నామినేషన్ వేయకముందే మునుగోడు ప్రజల ముండు అడ్డంగా బుక్కయ్యారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.