మధ్యప్రదేశ్‌లోని రేవా లోక్‌సభ బీజేపీకి చెందిన సభ్యుడు జనార్దన్ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో టాయిలెట్‌ను చేతులతో శుభ్రం చేసి వార్తల్లో నిలిచారు ఈ ఎంపీ.. ఇప్పుడు తాజాగా మరింత విచిత్రమైన సూచన చేశారు. ‘ఎన్నికలు రాగానే నాయకులు పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు.
ఉచిత రేషన్ పొందండి. కరెంట్ బిల్లు మాఫీ పొందండి. కానీ, ఎవరైనా ఉచితంగా నీరు సరఫరా చేస్తామంటే నమ్మవద్దు..’ అని ప్రజలకు సూచించారు. అంతటితో ఆటకుండా.. మద్యం తాగినా, గుట్కా తిన్నా, అయోడెక్స్ తిన్నా, టిన్నర్ వాసన చూసినా ఫర్వాలేదు కానీ నీటి పన్నులు మాత్రం చెల్లించాల్సిందే అని అన్నారు. కొన్ని ప్రభుత్వాలు నీటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని, అయితే నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నందున నీటి పన్నులు చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.