తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించింది.
ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో 3,03,56,894 మంది ఓటర్లున్నారు.. అయితే ఓటర్ల పరిశీలన తర్వాత 3,45,648 మంది ఓటర్లకు కొత్తగా స్థానం కల్పించి, 11,36,873 మంది ఓటర్లను తొలగించినట్టు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.