Site icon Dharuvu

ఫ్రాన్స్‌ అధ్యక్షుడుని చెప్పులతో కొట్టిన మహిళ

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది.అసలు వివరాల్లోకి వెళితే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌.. ఎక్కడికో వెళ్తున్నారు.అదే సమయంలో ఆలివ్‌ గ్రీన్‌ టీ షర్ట్‌ ధరించిన మహిళ ఎదురుపడి మాక్రాన్‌ చెంప పగులగొట్టింది.

ఒక్కసారిగా దాడి జరుగుడంతో మాక్రాన్‌తో పాటు భద్రతా సిబ్బంది ఖంగుతిన్నారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది ? అధ్యక్షుడిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటీ ? అనే వివరాలు తెలియరాలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది జూన్‌ 8న సైతం ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నది. డ్రోమ్ ప్రాంతంలోని టైన్-ఎల్ హెర్మిటేజ్ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను సందర్శించి, కొవిడ్ ప్రొటోకాల్స్ చెక్‌ చేసిన అనంతరం తిరిగి వెళ్లేందుకు మాక్రాన్‌ కారు వద్దకు బయలుదేరారు.

Exit mobile version