తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో.. సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి కృష్ణ సోదరుడు ఆదిశేష గిరి రావు,తనయుడు మహేష్ బాబు,సుధీర్ బాబు ఇతర కుటుంబ సభ్యులతో కల్సి హాజరయ్యారు.వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గోన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అటు ఏపీ ఇటు తెలంగాణ నుండి భారీ ఎత్తున సూపర్ స్టార్ అభిమానులు తరలివచ్చారు.ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ” నాన్న గారు నాకు అందించిన అతి పెద్ద బహుమతి మీరు.. మీ అభిమానం. ఆయన ఎక్కడకి వెళ్లలేదు. మన మధ్యనే ఉన్నారు. నాన్న గారు మనందరి గుండెల్లో చిరకాలం ఉంటారు. నాతో ఉండి నన్ను వెన్నంటి ప్రోత్సాహిస్తారు. మీ అభిమానం ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటున్నాను అని ఏమోషనల్ గా అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..
