దేశంలో అమ్మాయిలకంటే అబ్బాయిల్లోనే క్యాన్సర్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. చికిత్స అందజేసే విషయంలో బాలికల కంటే బాలురకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతున్నట్టు లాన్సెట్ ఆంకాలజీ నివేదిక తెలిపింది. క్యాన్సర్‌కు చికిత్స తీసుకొనేవారిలో బాలికల కంటే బాలురే ఎక్కువ మంది ఉన్నట్టు తేలింది.
జనవరి 2005-డిసెంబర్ 2019 మధ్య 0-19 ఏండ్ల వయస్కుల క్యాన్సర్ రిజిస్టర్లను పరిశీలించగా ఈ విషయం తెలిసిందని ఢిల్లీ ఎయిమ్స్, చెన్నై క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఎక్కువ ఖర్చయ్యే మూల కణ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తీసుకొన్న బాలబాలికల చిట్టాను పరిశీలించగా, అందులో బాలురే ఎక్కువగా ఉన్నట్టు తెలిసిందని వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంతో పోల్చితే ఉత్తర భారతదేశంలో బాలికలకు చికిత్స అందిస్తున్నది చాలా తక్కువని పేర్కొన్నారు.