తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు.
దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి అని చెప్పాలి. ఆస్కార్ తీసుకుంటే నేను అత్యంత సంతోషంగా ఉంటాను. ఇది మా విజయం కాదు.. ఇది ఇండియన్ సినిమా విజయం. దీనికి ఎవరూ క్రెడిట్ తీసుకోలేరు’ అని చెప్పారు.