బోర్డర్ -గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ మాట్లాడుతూ ” ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టు తొలి ఇన్నింగ్స్ మా జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదు.
తొలి ఇన్నింగ్స్ లో ఎక్కువ రన్స్ చేయడం ఎంత ముఖ్యమో బాగా అర్థమైంది. ఆసీస్ కు ఆధిక్యం లభించినా కూడా రెండో ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాం. తొలి ఇన్నింగ్స్ బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. మనం సరిగ్గా ఆడితే పిచో సంబంధం లేకుండా ఫలితాలు అవే వస్తాయి’ అని రోహిత్ మాట్లాడారు.