Home / NATIONAL / మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది.ఈక్రమంలో యడ్డీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విజయ్ సంకల్ప్ యాత్రలో పాల్గొనేందుకు యడియూరప్ప వెళ్తుండగా ఈరోజు సోమవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది.

హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ గ్రౌండ్‌లో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధ పదార్ధాలు ఉండటంతో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తాయి. పైలట్ చివరి నిమిషంలో చాకచక్యంగా హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయకుండా ముందుకు తీసుకు వెళ్లారు. అనంతరం అధికారులు క్లియరెన్స్ ఇవ్వడంతో సురక్షితంగా కిందకు ల్యాండ్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino