టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్.. టెస్టుల్లో 10వేల పరుగులు చేసి నేటికి 36 ఏళ్లు పూర్తవుతుంది. సరిగ్గా ఇదేరోజు 1987లో గవాస్కర్ 1030 టెస్ట్ పరుగులు చేసి.. ఇండియా తరపున ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ గా రికార్డు సృష్టించారు.
ఆరోజున గవాస్కర్ సాధించిన రికార్డును ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటూ.. 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయేలా చేశారు. ఈక్రమంలో ఫ్యాన్స్ ఇది గుర్తుచేసుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.