ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ తనపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది . నటిగా తన ప్రతిభ చూడలేని వారు చేసే విమర్శలను పట్టించుకోనని ఆమె చెప్పింది. రవీనా మాట్లాడుతూ…‘నేనొక మంచి చిత్రంలో నటించినప్పుడు నన్ను ఇష్టపడేవారు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రశంసిస్తుంటారు. ఇరవై మంది ఫాలోవర్స్ కూడా లేని కొందరు విమర్శించినంత మాత్రాన బాధపడను.
వారు నా సినిమాలు చూసి ఉండరని అనుకుంటున్నా. చూస్తే అలా మాట్లాడరు.సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారికి గ్లామర్ మాత్రమే ముఖ్యం. ప్రతిభావంతులైన నటీనటులు ఓ సినిమా కోసం ఎంత కష్టపడతారో వారికి తెలియదు.
నాకు కమర్షియల్ చిత్రాల్లో నటించడం ఇష్టమే. వాటితో పాటు సమాజ హితాన్ని కోరే కథాంశాల్లో భాగమవడం సంతృప్తినిస్తుంటుంది. అలా ‘మాత్ర్ ‘, ‘దమన్’, ‘జాగో’ వంటి చిత్రాల్లో నటించాను. ఇవన్నీ మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందినవే’ అని చెప్పింది.