అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది.
ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల కోట్లకు చేరుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు అంతర్జాతీయ ఇంగ్లీష్ పత్రిక ‘బ్లూమ్‌బర్గ్’ ఓ కథనంలో వెల్లడించింది. మొత్తం అప్పుల్లో బాండ్ల ద్వారా సేకరించిన రుణాలు 39 శాతానికి చేరినట్టు వివరించింది.
అంతర్జాతీయ బ్యాంకుల నుంచే 29 శాతం వరకు అప్పులను అదానీ గ్రూప్ సేకరించినట్టు పేర్కొంది. మిగతా 71 శాతం రుణాలను దేశంలోని బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, బాండ్ల నుంచి తీసుకున్నట్టు సమాచారం.