టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ‘స్టాక్ గ్రో’ అనే కంపెనీ గణాంకాల ప్రకారం విరాట్ నికర ఆస్తుల విలువ రూ.1050 కోట్లు అని తెలింది.
అంతర్జాతీయ క్రికెటర్లు అర్జిస్తున్న ఆదాయంలో ఇదే అత్యధికం.సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గానే కాక.. ఆసియాలోనే టాప్‌లో నిలిచిన కోహ్లీ.. ఇన్‌స్టాలో ఒక్కో పోస్టుకు దాదాపు 9 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.
టీమ్‌ఇండియాలో ‘ఏ ప్లస్’ కాంట్రాక్ట్‌లో కొనసాగుతున్న విరాట్.. ఐపీఎల్లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 18 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. దీంతో పాటు పలు స్టార్టప్స్‌లో అతడు పెట్టుబడులు పెట్టాడు.