దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట ధర గరిష్ఠానికి చేరింది.
ముంబైతోపాటు పలు నగరాల్లో రూ.160 పలుకుతున్నది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అత్యధికంగా కేజీకి రూ.162గా ఉంది. ఇక హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో టమాట ధర గురించి చెబితే అంతా నోరెళ్లబెట్టాల్సిందే.
ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో కిలో టమాట ధర రూ.250కి చేరింది. ఉత్తరకాశి జిల్లాలో రూ.180 నుంచి రూ.200 పలుకుతున్నది. అయితే దేశవ్యాప్తంగా సగటు ధర రూ.120 దాటింది. కోల్‌కతాలో రూ.152, ఢిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117గా ఉన్నది. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో రూ.31గా ఉన్నది.