Home / ANDHRAPRADESH / చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ -పేర్నినాని
ex minister perni nani shocking comments on nara chandrababu naidu vision 2047

చంద్రబాబుది దిక్కుమాలిన విజన్ -పేర్నినాని

మరొసారి మాజీ మంత్రి పేర్నినాని చంద్రబాబు పై మండిపడ్డారు . చంద్రబాబు చెప్తున్న విజన్ అర్ధం లేనిది అని , విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .ఉచిత విద్యుత్‌పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబ. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు .చంద్రబాబు కాలజ్ఞానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

గతంలో చెప్పిన విజన్‌ 2020 ఏమైంది?. అలానే ఈ 2047 కూడా సుత్తి విజన్ . చంద్రబాబు చెప్పిన ఏ విజన్ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయింది .చంద్రబాబు విజనరీ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయింది.చంద్రబాబు నువ్వు నీ సొంత నియోజకవర్గం అయిన కుప్పానికి కనీసం నీళ్లయిన ఇచ్చావా?. రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టు అయిన పూర్తి చేశావా ?. ప్రాజెక్టుల సందర్శన అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నావ్ . కనీసం ఆవగింజంత అయిన కూడా సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు. ఏ పి ప్రజలను అమాయకులుగా అనుకుంటూ ప్రాజెక్టులను సందర్శిస్తూ ఎవరిని మోసం చేయాలి అని అనుకుంటున్నావ్ చంద్రబాబు .చంద్రబాబు ఒక్క పధకం కూడా ఏపిలో నూతనంగా చేపట్టలేదు . ఉన్న పధకాలలో అవినీతి చేయడమే సరిపోయింది. విజన్‌ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు విజన్‌ లేదు అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

రాజకీయ అనుభవజ్ఞుడిని అని చెప్పుకొనే నువ్వు ఏనాడైన ప్రభుత్వ స్కూల్స్ ని పట్టించుకున్నవా ?. నారావారి పల్లెలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అయిన బాగు చేశావా?. విజన్ అంటే వైయస్ఆర్ గారిది . ఆరోగ్య శ్రీ పధకం ఒక్కటి చాలు ఆయన విజన్ చెప్పడానికి , ఆ విజన్ ని సిఎం జగన్ ముందుకు తీసుకు వెళ్తూ అనేక కొత్త వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు.విజన్ అంటే నవరత్నాలు . నవరత్నాలు ఎలా అమలు అవుతున్నాయో ప్రజలు చూస్తున్నారు. దొంగ మాటలు ఆపాలి అంటూ చంద్రబాబు ని ఆయన హెచ్చరించారు.

 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat