Home / MOVIES / సూపర్ స్టార్ గా ఎదిగినా మూలాలను మరవని తలైవా…దటీజ్ రజనీ..!

సూపర్ స్టార్ గా ఎదిగినా మూలాలను మరవని తలైవా…దటీజ్ రజనీ..!

సూపర్ స్టార్ రజనీకాంత్..  కోట్లాది మంది భారయులకు ఆరాధ్యదైవం..ఒక కోలీవుడ్ లోనే కాదు..టాలీవుడ్..బాలీవుడ్..ఇలా భాషలతో నిమిత్తం లేకుండా…యావత్ దేశమంతటా రజనీ కాంత్ ని ఆరాధిస్తుంటారు..కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన నిరాడంబర వ్యక్తిత్వంతో రజనీకాంత్ హీరోలందరిలో ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఓ సాధార‌ణ బ‌స్ కండ‌క్ట‌ర్ స్థాయి నుంచి సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.. అయితే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండ‌డం ఆయ‌న వ‌ల్లే సాధ్యం…రీల్ లైఫ్ లో ఎంతో స్టైలిష్‌గా అదరగొట్టే రజనీకాంత్ రియల్ లైఫ్ లో మాత్రం సామాన్యుడిలా ఉంటారు..ఆయన వేషధారణ కూడా సాధారణ లాల్చీ, జుబ్బాతో సింపుల్ గా ఉంటారు..సడన్ గా హిమాలయాలకు వెళుతుంటారు..తనకంటే చిన్నవారిని కూడా గౌరవిస్తుంటారు..దేశం ఆరాధించే సూపర్ స్టార్ గా ఎదిగినా..తాను మాత్రం అంతా దేవుడి దయ…మనం నిమిత్తమాత్రులం అంటూ బాబాలా వేదాంతం చెబుతారు. సూపర్ స్టార్ అయినా తన మూలాలను ఇప్పటికీ మర్చిపోలేదు కాబట్టే ఆయన సినిమాలతో నిమిత్తం లేకుండా, హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా  దేశవ్యాప్తంగా అంతులేని క్రేజ్ సంపాదించుకున్నారు.

తాజాగా రజనీకాంత్ తాను ప‌నిచేసిన బ‌స్ డిపోకు వెళ్లాడు. అక్క‌డి వారంద‌రితో స‌ర‌దాగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ర‌జినీకాంత్ తాను పనిచేసిన ద‌క్షిణ బెంగ‌ళూరులోని జ‌య‌న‌గ‌ర్ ప్రాంతంలోని బీఎంటీసీ డిపోకు వెళ్లారు. ఆయ‌న వ‌స్తున్న‌ట్లు అక్క‌డి సిబ్బందికి గానీ.. అధికారులకు గానీ ఎలాంటి స‌మాచారం లేదు. దీంతో ర‌జినీకాంత్‌ను చూసిన వారు ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గురైయ్యారు. డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు, ఇత‌ర అధికారుల‌తో త‌లైవా కాసేపు ముచ్చ‌టించారు. వారంద‌రితో సెల్ఫీలు దిగారు. ఇక ర‌జినీకాంత్ వ‌చ్చార‌ని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్య‌లో డిపో వ‌ద్ద‌కు వ‌చ్చారు. మొత్తంగా బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్..తన మూలాలను మర్చిపోకుండా బస్ డిపోకు వెళ్లి..డ్రైవర్లు, కండకర్టలను పలకరించి..వారితో సెల్ఫీలు దిగడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం బ‌స్ డిపోలో సూప‌ర్ స్టార్ ఉన్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీన్ని చూసిన నెటీజ‌న్లు.. అస‌లైన సూప‌ర్ స్టార్ రజినీకాంతే అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat