Home / ANDHRAPRADESH / ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్…కేవలం మా కులపోళ్ల కోసమే..బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్…కేవలం మా కులపోళ్ల కోసమే..బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..!

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ 100 రూపాయల స్మారక నాణెం విడుదల కావడంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి..కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తించి ఏకంగా రాష్ట్రపతి చే విడుదల చేయించింది…దీని ఘనత చంద్రబాబు, పురంధేశ్వరిలకే దక్కుతుందంటూ పచ్చ మీడియా నిస్సిగ్గుగా ప్రచారం చేస్తోంది..అయితే ఈ కార్యక్రమానికి తనను పిలవకపోవడంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ సతీమణి కేంద్రానికి, రాష్ట్రపతి భవన్ కు లేఖలు రాయడంతో అసలు విషయం బయటపడింది..అబ్బే..ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించలేదు..ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ రాష్ట్రపతిని రిక్వెస్ట్ చేసుకుని కండక్ట్ చేసిన ప్రైవేట్ ప్రోగ్రామ్..పైగా ఎన్టీఆర్ రూ. 100 కాయిన్ బహిరంగ మార్కెట్ లో చెల్లదు..అది కేవలం స్మారక నాణెం మాత్రం..మారకం కాదు..కావాలంటే ఒక్కో కాయిన్ 4 వేలకు కొనుక్కోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వ వివరణ ఇచ్చింది. దీంతో ఎన్నికలకు ముందు టీడీపీకి మైలేజీ కోసం..మరోవైపు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు కోసం పురంధేశ్వరీ చేసిన ఘనకార్యం ఇదని బయటపడింది. ఇంకేముంది చరిత్రపురుషుడిని కాస్తా చెల్లని కాసుగా మార్చారు కదారా మీ దుంపతెగ అంటూ చంద్రబాబు, బాలయ్యతో సహా నందమూరి కుటుంబాన్ని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఎన్టీఆర్ 100 రూపాయల కాయిన్ కేవలం స్మారకమేరా బాబు..మారకం కాదు..అది చెల్లదని కేంద్రమే చెబుతున్నా..చెల్లుతుందని కమ్మ సామాజికవర్గీయులు ఓవరాక్షన్ చేస్తున్నారు..అయితే అదే సామాజికవర్గానికి చెందిన వివాదాస్పద కమేడియన్ కమ్ పొలిటీషియన్ అయిన బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ 100 రూపాయిల కాయిన్ కేవలం మా కమ్మ కులపోళ్ల కోసమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు స్మారకం అంటే మారకం అంటే ఏంటనేది బండ్ల గణేష్ తన ట్వీట్ లో తన కమ్మ కులపోళ్ల కళ్లు తెరుచుకునేలా క్లారిటీగా చెప్పారు.. “నాణాలలో రెండు రకాలు ఉంటాయి. స్మారకం, మారకం. స్మారకం అంటే జ్ఞాపకార్థం వేసే నాణాలు, మారకం అంటే ప్రజల్లో చెలామణీలో ఉండే నాణాలు. మొన్న వేసినది స్మారక నాణాలు. కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ మినిస్ట్రీ అజమాయిషీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు వర్గాలు ఉంటాయి. నాసిక్ లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్సులో రూపాయిల నోట్లు, ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు ముద్రిస్తారు. ముంబాయి, కోల్‌కతా, హైదరాబాదుల్లో ఉన్న మింట్ లో మారకం అయ్యే నాణాలు (రూపాయి బిళ్ళలు) తయారుచేస్తారు. ఇవే గాక, మనం ఏ వ్యక్తి పేరుమీదైనా మాకిన్ని నాణాలు కావాలని ఏదైనా కుటుంబం నిర్ణీతమైన మొత్తాన్ని వారికి కడితే, వారు కోరినన్ని నాణాలను ముద్రించి యిస్తారు. అయితే అవి ఎక్కువ మొత్త్గంలో ఉంటేనే అంగీకరిస్తారని బండ్ల ట్వీట్ లో వివరించారు..

అలాగే మొన్న విడుదలైన రామారావు గారి బొమ్మతో ఉన్న నాణెం అలాంటిదే! పురందేశ్వరి గారు అలా అర్డరిచ్చి 14 వేల నాణాలను ముంద్రింపించారుట! అవి సాధారణంగా నాణాలను సేకరించి దాచుకొనేవాళ్ళు కొంటారు. ఈవిడ డబ్బులు కట్టి వాటిని ముద్రింపించి, రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేయమని ఆమెను అడిగితే, ముర్ము గారు ఒప్పుకొన్నారు. ఇటీవలే పి.వి.నరసింహారావు గారి శత జయంతి జరిగింది. మరి ప్రభుత్వం ఆయన నాణాన్ని ఎందుకు విడుదల చేయలేదు? ఆయన కుటుంబం ఆ పని చేయలేదు. రామారావు గారి కుటుంబం దానికి పూనుకొంది. ఎన్నికల సమయం కావటంతో కొంత రాజకీయం కూడా ఉంటుంది. లక్ష్మీపార్వతి గారు కూడ ఎన్నికల సమయం కాబట్టి గొడవ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు గనుక ఆమెను పిలవలేదు. కుటుంబసభ్యులుగా భావించిన వారిని మాత్రమే వాళ్ళు పిలుచుకొన్నారు. ఈమె వివాహం అయ్యాక, కన్నతండ్రినే ఆ కుటుంబం బయటపెట్టింది. ఇంక ఈమెను తమ కుటుంబ కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారని బండ్ల వేసిన ప్రశ్న సూటిగా టీడీపీ వర్గాలకు, నందమూరి కుటుంబానికి తగిలిందనే చెప్పాలి.

రామారావు గారి నాణాలు హైదరాబాదు మింట్ లో తయారయ్యాయి. నాణాలు కావలసిన వాళ్ళు నాణానికి మూడు వేలు కడితే, యిస్తామని మింట్ డైరెక్టర్ మొన్ననే ప్రకటించారు. నేను సర్వీసు చివరలో మింట్ లో పనిచేసాను గనుక యిదంతా తెలిసింది. అవి ఎక్కువగా తెలుగుదేశం నాయకులు, బంధుబలగాలు కొని దాచుకోవటానికే తప్ప, మార్కెట్టులో చెల్లుబాటు అయ్యే నాణాలు కావు. చెల్లుబాటు కాని నాణెం కోసం రచ్చ చేసుకోవటం అనవసరం. ఎవరికైనా సరదా ఉంటే, ఒక నాణానికి మూడు వేలు చెల్లించి తెచ్చుకొని, పూజగదిలో పెట్టుకోవచ్చు ” బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ 100 రూపాయి కాయిన్ విడుదల కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసిందంటూ..ఇదంతా చంద్రబాబు పుణ్యమే అంటూ డబ్బా కొడుతున్న కొన్ని కుల పత్రికలు, కొన్ని గుల ఛానళ్లు కమ్మగా చేస్తున్న ప్రచారం అంతా ఉట్టిదే అని అదే కమ్మ కులానికి చెందిన బండ్ల గణేష్ ఒక్క ట్వీట్ తో తేల్చిపడేశారు..బండ్లతో అట్లుంటది మరి..!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat