జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా సహజీవనం చేయడం..ఆ తర్వాత పొత్తు అనే పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది…గత పదేళ్లుగా పవన్ రాజకీయం చూస్తే
పవన్ రాజకీయ సహజీవనాలపై క్లారిటీ వస్తుంది…2014 లో పార్టీ పెట్టిన.తొలి రోజే..కాంగ్రెస్ నాయకులను పంచెలూడదీసి కొడతానని రంకెలు వేసిన పవన్…టీడీపీ అధినేత చంద్రబాబుపై చిరునవ్వుతో వలపు బాణాలు వేసాడు..అప్పుడే అర్థమైపోయింది..అప్పుడు మొదలైన రొమాన్స్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది..ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసి చంద్రబాబును గెలిపించిన పవన్..ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేసుకుంటూ..మధ్య మధ్యలో చంద్రబాబుకు నాటి ప్రతిపక్ష నేత జగన్ పోరాటాల వల్ల ఇబ్బంది ఎదురైనప్పుడల్లా..షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పి..ఏపీకి వచ్చి ఓ రెండు, మూడు రోజులు ప్రజల ముందు హడావుడి చేసేవాడు….ఆ ఇష్యూని పక్కదారి పట్టించి..తన పార్టనర్ చంద్రబాబును గట్టెక్కించి మళ్లీ సిన్మా షూటింగ్‌లకు వెళ్లిపోయేవాడు..2019 ఎన్నికలప్పుడు జగన్ వేవ్ లో కొట్టుకుపోకతప్పదని భయపడిన చంద్రబాబు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి పవన్ ని వ్యూహాత్మకంగా బయటకు పంపించాడు..పవన్ కూడా చంద్రబాబు, లోకేష్‌లు అవినీతిని ప్రశ్నిస్తున్నా అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు.
అయితే ఏపీ ప్రజలు చంద్రబాబు, పవన్‌ల సీక్రెట్ గా చేస్తున్న సహజీవనాన్ని గుర్తించి ఛీకొట్టి…జగన్‌కు గ్రాండ్ విక్టరీ అందించారు..దీంతో మళ్లీ తన పార్టనర్ కోసం కమ్యూనిస్టులకు విడాకులు ఇచ్చిన పవన్ మళ్లీ కాషాయపార్టీతో రొమాన్స్ మొదలుపెట్టాడు..ఓ పక్క బీజేపీతో కాపురం చేస్తూనే ..మరో పక్క తన మాజీ పార్టనర్ చంద్రబాబుతో రహస్యంగా సహజీవనం కొనసాగిస్తూనే ఉన్న పవన్…ఇప్పుడు ముసుగు తీసేశాడు.. తన పార్టనర్ జైలుకు వెళ్లడంతో ఎమోషనల్ అయిపోయిన పవన్ ..ఇన్నాళ్లు చంద్రబాబుతో చేస్తున్న రహస్య సహజీవనానికి స్వస్తిపలికాడు…రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన పవన్ …తన పార్టీని టీడీపీతో మిలాఖత్ చేసుకున్నాడు.ఇదే విషయమై కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా .పవన్ వ్యక్తిగత జీవితంలో కొనసాగించిన లివింగ్ రిలేషన్లను రాజకీయాలకు ముడిపెడుతూ..వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సహజీవనం చేస్తున్న జంట..ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది..నేను ఏ ఉద్దేశ్యంతో అన్నానో తెలుసా అంటూ తన ట్వీట్ ద్వారా నెట్‌జన్లను ప్రశ్నించాడు..దీంతో ఇన్నాళ్లు సీక్రెట్‌గా సహజీవనం చేస్తున్న టీడీపీ కోసం…నాలుగేళ్లుగా కాపురం చేస్తున్న బీజేపీకి విడాకులు ఇవ్వడానికైనా రెడీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే అంటూ నెట్‌జన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు..సహజీవనం చేస్తున్న ఆ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది ఎవరో కాదు..టీడీపీ, జనసేన పార్టీలే అని వర్మ చెప్పకనే చెప్పాడు..అదీ సంగతి..అర్థమైందా రాజా..!