జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో పదేపదే ఒక కవిత ప్రస్తావిస్తుంటారు…ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన .”సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే కవితను పవన్ కల్యాణ్ తనదైన ఆవేశంతో ఊగిపోతూ చెబుతుంటే అభిమానులు ఉర్రూతలూగారు..గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఈ కవిత గతంలో సాహితీ అభిమానులకే తెలుసు..కానీ పవన్ తరచుగా తన సభలలో ఈ కవితను ప్రస్తావించడం ద్వారా తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులరైంది..
అయితే సీబీఐ తాజాగా మాజీ జేడీ అయిన వీవీ లక్ష్మీ నారాయణ పవన్ కల్యాణ్ తరుచుగా ప్రస్తావించే ఈ కవితను ట్వీట్ చేయడం రాజకీయవర్గాల్లో పలు ఊహాగానాలకు తెరలేపింది. సీబీఐ జేడీగా వీఆర్ఎస్ తీసుకున్న జేడీ కొంత కాలం స్వచ్ఛంధ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాటు చేపట్టారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నిజాయితీపరుడని నమ్మి జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి వైజాగ్ ఎంపీగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ పవన్ కల్యాణ్ నిలకడ లేని తత్వం, చంద్రబాబుతో కుమ్మక్కు రాజకీయం నచ్చక జనసేనకు రాజీనామా చేసారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా..సమకాలీన రాజకీయాల్లో ఒంటరిగానే కొనసాగిస్తున్నారు. అయితే స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుని కలసి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ జైలు బయటనే పొత్తులను ప్రకటించారు…అసలు పొత్తుల గురించి పార్టీలో చర్చించకుండా..కేవలం దత్తతండ్రి పై ప్రేమతో జైలు బయటనే ఆవేశంతో పొత్తు ప్రకటన చేసిన పవన్ కల్యాణ్‌పై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు..పైగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం..ఎన్ని సీట్లు ఇచ్చినా పొత్తు ధర్మానికి తలగ్గొల్సాందే..త్యాగాలకు సిద్దంగా ఉండాలి అంటూ జనసేన నేతలకు పవన్ సూచించాడు..
ఈ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ, జనసేన మాజీ నేత అయిన లక్ష్మీ నారాయణ చంద్రబాబుకు కాళ్ల దగ్గర జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పవన్ కల్యాణ్‌ని ఉద్దేశిస్తూ…సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు..పర్వతం వంగి ఎవడికి సలాం చేయదు అంటూ పవన్ గతంలో చెప్పిన ట్వీట్‌నే కోట్ చేసి కౌంటర్ ఇచ్చాడని విమర్శకులు అంటున్నారు. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కంగ్రాట్స్ చేస్తూ జేడీ మరో ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఒకే రోజున కేసీయార్ 9 , జగన్ 5 వైద్య కళాశాలలను ప్రారభించారు. దీన్ని వైట్ కోట్ రివల్యూషన్ గా మాజీ జేడీ అభివర్ణించారు. కాగా రాజమండ్రి ములాఖత్ ద్వారా చంద్రబాబుతో మిలాఖత్ అయిన పవన్ కల్యాణ్‌కు తన ట్వీట్‌తో అక్షింతలు వేసిన సీబీఐ మాజీ జేడీ..జగన్, కేసీఆర్‌లపై ప్రశంసలు కురిపించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది..ఓ రకంగా సీబీఐ మాజీ జేడీ చంద్రబాబుతో పవన్ పొత్తును వ్యతిరేకిస్తూ..జగన్, కేసీఆర్‌లపై వైపు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. మొత్తంగా సీబీఐ మాజీ జేడీ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కాక రేపుతున్నాయనే చెప్పాలి.