Home / ANDHRAPRADESH / జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు..టీడీపీ మూకలపై గౌడ సంఘం నాయకుల ఫైర్..!

జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు..టీడీపీ మూకలపై గౌడ సంఘం నాయకుల ఫైర్..!

గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 371 కోట్ల ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు..రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్‌లో ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే..అయితే ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని దొరకని దొంగలా..దర్జాగా తప్పించుకుని తిరుగుతున్న
స్కామ్ స్టర్ చంద్రబాబుని ఈ స్కిల్ స్కామ్ ఏం చేయలేదు..అసలు ఇది కేసే కాదు…మా బాబు నిప్పు నాయుడు…ఆయనకు బెయిల్ లేదు..జైలు లేదు…ఏసీబీ కోర్టు సీఐడీ పోలీసులకు మొట్టికాయలు వేసి సాయంత్రం కల్లా చంద్రబాబు బయటకు వచ్చేస్తాడంటూ విర్రవీగిన టీడీపీ నాయకులకు, పచ్చ మీడియా ఛానళ్లకు దిమ్మతిరిగేలా ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సంచలన తీర్పు ఇచ్చారు.

స్కిల్ స్కామ్‌లో సీఐడీ పోలీసుల తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమర్పించిన ఆధారాలు, వాదనల ముందు..కోట్లుతగలేసి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న టీడీపీ లాయర్ లూథ్రా వాదనసలు తేలిపోయాయి.. .పొన్నవోలు వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో బాబుగారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆతర్వాత చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు లోకేష్ అండ్ లూథ్రా బ్యాచ్…హౌస్ అరెస్ట్ పిటీషన్ వేస్తే..అసలు ఇంట్లో కంటే జైల్లోనే బాబుకు భద్రత అన్న ఏఏజీ పొన్నవోలు వాదనలతో ఏసీబీ కోర్డు ఆ పీటీషన్‌ను వారం రోజుల పాటు వాయిదావేసింది..దీంతో నిప్పు నాయుడు అలియాస్ చంద్రబాబును జైలుకు పంపించదనే కారణంతో జడ్జి హిమబిందుపై పచ్చమూకలు..సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో మాటల్లో చెప్పరాని బూతులు తిడుతున్నారు.

చంద్రబాబుకు బెయిల్ వచ్చే టైమ్‌లో హిమబిందుకు ఫోన్ వచ్చిందని. ఆమె కాల్ డేటాను బయటపెట్టాలంటూ..బుద్ధా వెంకన్న లాంటి బుద్ధిలేని టీడీపీ నేతలు సిగ్గులేకుండా ఆరోపణలు చేస్తున్నారు..ఇక మహిళ అని కూడా చూడకుండా..పచ్చ నేతలు తిడుతున్న బూతులు, అసభ్యకర పదజాలం వింటే వాళ్లను కన్నతల్లులు కూడా సిగ్గుతో తలదించుకోవడం ఖాయం…అంత దారుణంగా మహిళా జడ్జిని వేధింపులకు గురి చేస్తున్నారు. జడ్జి హిమబిందుపై పచ్చమూకల దాడులతో అప్రమత్తమైన ప్రభుత్వం ఏఏజీ పొన్నవోలుకు, జడ్జి హిమబిందుకు భద్రత పెంచాల్సి వచ్చింది..ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళా న్యాయమూర్తిపై కేవలం చంద్రబాబుకు రిమాండ్ విధించిందనే కారణంతో జడ్జి హిమబిందుపై పచ్చ మూకలు చేస్తున్న అసభ్యకర దాడులపై ఏపీ గౌడ సంఘం నాయకులు మండిపడుతున్నారు. జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పచ్చమూకలు పెడుతున్న అసభ్యకర పోస్టులను పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమస్య సంఘం నాయకులు ఖండించారు . ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా తప్పు చేసాడనే కారణంతో చంద్రబాబుకు రిమాండ్ విధించిన జడ్జి హిమబిందు తన డ్యూటీ తాను చేస్తే..ఇలా సోషల్ మీడియాలో మహిళ న్యాయమూర్తి అన్న గౌరవం కూడా లేకుండా అసభ్యకర పోస్టులతో వేధిస్తున్న టీడీపీ నేతలు, సానుభూతిపరులపై వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గౌడ సంఘం నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు. అవసరమైతే గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా రోడ్లమీదకు వచ్చి టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇక  కోర్టులలో జడ్జిలుగా బీసీ లు ఉండకూడదని గతంలో చంద్రబాబు అన్న సంగతిని వాళ్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలపై బీసీ వర్గానికి చెందిన మహిళ హిమ బిందు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించారని..బీసీలను చిన్నచూపు చూస్తే తగిన శాస్త్రి చెబుతామని గౌడ సంఘం నాయకులు హెచ్చరించారు. జడ్జి హిమబిందుకోసం ఏమి తెలియని వారు సైతం ఎవరిదో ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి ఆమె హిమబిందుగా ప్రచారం చేస్తున్నారని వారు తీవ్రంగా దుయ్యబట్టారు. జడ్జి హిమబిందు శెట్టిబలిజ గీత కులానికి వర్గానికి చెందిన మహిళ అని వారు తెలిపారు. సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ శ్రేణులు రాజ్యసభ సభ్యులు, అగ్నికుల క్షత్రియులు మోపిదేవి వెంకటరమణ మేనకోడలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గౌడ సంఘం నాయకులు విమర్శించారు. కోర్టులలో న్యాయం జరగకపోతే కత్తి పట్టుకుని యుద్ధం చేయాలన్న చంద్రబాబు లాయర్ లూధ్రా వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా స్కిల్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించి జైలుకు పంపించారనే కారణంతో జడ్జి హిమబిందును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాల ఆమెను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ..బూతులు తిడుతున్న లోకేష్ బ్యాచ్‌పై, పైశాచిక ఆనందం పొందుతున్న పచ్చ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat