Home / ANDHRAPRADESH / వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!

వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!

టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లి 10 రోజులు దాటింది..అయితే ఇవాళ చంద్రబాబు కేసుల్లో రెండు తీర్పులు రానున్నాయి..ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇస్తుందా…లేదా…కస్టడీకి ఇస్తుందా అనేది టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది..మరోవైపు చంద్రబాబుకు జైల్లో వేడినీళ్లు లేవు..చన్నీళ్లతో స్నానం చేస్తున్నారంటూ..ఆయన సతీమణి భువనేశ్వరీ ములాఖత్ కు వెళ్లినప్పుడు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే..అసలు చన్నీళ్లతో స్నానం చేస్తే ఉన్న బొల్లి ఏం తగ్గదని వైసీసీ శ్రేణులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు..అయితే ఇంటి నుంచి భోజనం , మందులు తీసుకువెళుతున్నారుగా…అలాగే ఓ బకెట్ వేడినీళ్లు కూడా తీసుకువెళ్లే జైలు అధికారులు వద్దంటారా…అంటూ భువనేశ్వరిపై సెటైర్లు వేస్తున్నారు..ఇక తమ కుల దైవం చంద్రబాబు కు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి రావడంతో పచ్చమీడియా శోకాలకు అంతే లేకుండా పోయింది..మా బాబుగారికి దోమలు కుడుతున్నాయి..అసలు ఎక్కడి నుంచో దోమలను తీసుకువచ్చి…ఆయన జైలు గదిలోకి వదిలి..స్లోపాయిజన్ ద్వారా ఆయన్ని లేపేయడానికి జగన్ సర్కార్ కుట్ర పన్నుతుందంటూ..నవ్విపోదురు కాక నాకేటీ సిగ్గంటూ..పచ్చమీడియా పిచ్చెక్కినట్లు పచ్చ కథనాలు పచ్చిగా వండివారుస్తోంది..ఇంకా నయం పులివెందుల నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో దోమలను తీసుకువచ్చి మీ బాబోరిని లేపేసే కుట్ర జరుగుతుందని అనలేదు అంటూ వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు పచ్చమీడియా పైత్యంపై పంచ్‌లు వేస్తున్నారు..ఇ

తాజాగా  తమ పచ్చమీడియా కథనాల ఆధారంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా మా బాబుగారిని దోమలు కుట్టి సంపుతున్నాయంటూ వాపోతున్నారు..బాబుగారికి జైల్లో ఏసీ కావాలంట..ఏసీ లేక ఆయనకు బాగా ఇబ్బంది అవుతుందంట..దోమలు కూడా కుడుతున్నాయని బాబోరు వాపోయారంట…ఇటీవలే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి..అలాగే చంద్రబాబు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారని చెబుతున్నారు..వెంటనే మా బాబోరికి వేడినీళ్లు స్నానానికి ఇవ్వాలని కోరుతున్నాం అంటూ అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అయితే టీడీపీ ఆరోపణలను వైఎస్ఆర్‌సీపీ నేతలు గట్టిగా తిప్పికొడుతున్నారు. జైల్లో చంద్రబాబుకు నిర్దేశిత నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలున్నాయని, ఇంటి భోజనంకు అనుమతిస్తున్నారు, వేడి నీళ్లు కూడా ఇస్తున్నారని, కోర్టు కల్పించిన అన్ని సౌకర్యాలు ఉన్నా టీడీపీ కావాలని బాబుగారి అరెస్ట్‌పై ప్రజల్లో సానుభూతి కోసం ఇలా ప్రభుత్వంపై బురద జల్లుతుందని..రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు..అయితే బాబుగారికి జైలు గదిలో ఫ్యాన్ ఉంది..ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో పెట్టుకుంటే…దగ్గరకు కూడా రావు…అలాగే జైలు సిబ్బందిని అడిగి జెట్ కాయిల్స్ లేదా ఆలవుట్ లాంటివి అడిగి తెప్పించుకోవచ్చు..కానీ ఫ్యాన్ వాడకుండా..దోమలు కుట్టి రాద్ధాంతం చేసి రేపు డెంగ్యూ వస్తే మా బాబుగారిని లేపేయడానికి ప్రభుత్వం దోమలతో కుట్ర చేసిందన్న ఎల్లోమీడియా ప్రచారాన్ని నిజం చేసే అవకాశం ఉంది…

అయినా…ఈ దోమలు, చన్నీళ్లు గోల 16 నెలలు జగన్ జైల్లో ఉన్నప్పుడు చర్చలోకి రాలేదు..అసలు జగన్ జైల్లో ఉన్న రోజులు పచ్చమీడియా పండుగ చేసుకుంది…జైలు తిండి తిని జగన్ నిగనిగలాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేసింది..ఇప్పుడు తమ కమ్మ కుల దైవం బాబోరు జైలుకు వెళ్లేసరికి దోమలు, చన్నీళ్లు అంటూ టీడీపీ నేతలతో కలిసి పచ్చమీడియా తన పైత్యాన్ని ప్రదర్శిస్తోంది..ఇదే విషయమై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు..వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా అంటూ టీడీపీ నేతల దోమల గోలపై తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. పాపం బాబుగారికి తల పైకెత్తితే జగన్ పార్టీ సింబల్ ఫ్యాన్ గుర్తు కనపడేసరికి…కోపంతో ఇలా ఫ్యాన్ వేసుకోకుండా దోమలు కుడుతున్నాయంటూ లొల్లి చేస్తున్నాడంటూ…సోషల్ మీడియాలో చంద్రబాబు దోమల గోలపై ఓ రేంజ్‌లో సెటైర్లు పడుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat