మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించి వారి సమస్యలను తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు అన్నారు.తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కె.పి. వివేకానంద్ గారికి తమ పూర్తి మద్దతును తెలుపుతూ కొంపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఐఎంఐఎం నాయకులు ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ మీర్జా రహమత్ బేగ్ హాజరై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మైనారిటీ సోదరుల అభివృద్ధి కోసం అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు తీర్చామన్నారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మునీరుద్దీన్, నాయకులు ఫక్రు, మతిన్, అక్బర్, యాకూబ్, అజార్, జిలాని, కబీర్ ఖాన్, అమీర్ ఖాన్, సలీం, అఫ్జల్, ఆదిల్, నబీ, అబూ బాకర్ తదితరులు పాల్గొన్నారు.