హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి తీవ్ర కడుపునొప్పితో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ లో చేరారు. అక్కడ సీఎంను పరీక్షించిన వైద్యులు కడుపులో ఇన్‌ఫెక్షన్ అయినట్లు గుర్తించారు.
తాజాగా ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. వైద్య పరీక్షల కోసం శుక్రవారం సీఎంను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఐజీఎమ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ రావు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. అన్ని పరీక్షలు సాధారణంగానే వచ్చాయని తెలిపారు.