తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ అచ్చం పేట ఎమ్మెల్యే అభ్యర్థి.. తాజా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై కాంగ్రెస్ అనుచరుల దాడిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని అన్నారు. ప్రజలకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పి ప్రజల మనసు గెలుచుకుని ఎన్నికల్లో గెలవాలే తప్పా ఓటమి భయంతో దాడులకు దిగడం శోచనీయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు దిగజారుడు విధానాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు, నిరాధార ఆరోపణలకు తెరలేపుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కవ్వింపు చర్యలకు బీఆర్ఎస్ శ్రేణులు స్పందించవద్దని శ్రేణులకు సూచించారు. గత పదేళ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇచ్చిన పథకాలు, చేసిన అభివృద్ది గడప గడపకూ వివరించి ఓట్లను అభ్యర్థించాలని కోరారు.