తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర శివార్లలో భారీ నగదు పట్టుబడింది. ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ. 6.5 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో నగదు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ పట్టుబడ్డ నగదు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు… ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి…మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
