తెలంగాణలో కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం లోని విఐపి ఫంక్షన్ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ & కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు చేపట్టిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానంచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ హైదరాబాద్ నగరం నేడు వైద్యరంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి, మన దేశ ప్రజలకు మందులను ఎగుమతి చేసి మెడికల్ హబ్ గా తయారైందన్నారు. నేడు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా కంపెనీ, ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయంటే దానికి కేవలం టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటులో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలేనన్నారు.
ఇటువంటి పారిశ్రామిక విధానంతో పెట్టుబడులను ఆకర్షించే విధానంతో ముందుకు సాగుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముచ్చటగా మూడవసారి మూడవ నెంబర్ పై ఓటు వేసి భారీ మెజార్టీతో విజయాన్ని అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, షౌకత్ అలీ, డాక్టర్లు పాండు, సలీం, ప్రసాద్, సాయి ప్రసాద్, మోహన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.