కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు,ఆకలి చావులు,కరెంటు గోసలు ఉండేవని పరకాల అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.గురువారంనియోజకవర్గంలోని సంగెం మండలం సోoమ్లతండా, తీగరాజుపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, రైతు ఆర్ధికంగా ఎదుగుతున్నారని,కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని అంటున్నారని,రైతులకు రైతు బీమా ద్వారా రైతు చనిపోతే వారి కుటుంబానికి ధీమా కలిపిస్తున్న నేత కేసీఆర్ గారని,దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు అండగా నిలిచిన నాయకుడు లేడని, రైతులకు ధీమా కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారని కొనియాడారు.ఎదుగుతున్న తెలంగాణను ఆగం చేసుకోవద్దని,రైతు బీమా తరహాలో సహజ మరణం పొందిన వారికి కూడా రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే ప్రతి నిర్ణయం డిల్లి పాలన చేతిలో ఉంటుందని, బీజేపీ పార్టీ కి ఓటు వేస్తే గుజరాతి చేతిలో ఉంటుందని ,కారు గుర్తుకు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతులో ఉంటుందని అన్నారు.ప్రజలు ఆలోచించాలని ఢిల్లీ కావాలో ,గుజరాతి కావాలో ,తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం అసన్నం అయిందని అన్నారు..ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…
