ఎయిన్స్టిన్ మీడియా, నెస్ట్లల్ స్టూడియో & అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై జోజు జార్జ్, కల్యాణి ప్రియదర్శన్ , చంబన్ వినోద్ జోష్, నైలా ఉష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అంథోని. ఈ సినిమాకు జోషి దర్శకుడు, ఎయిన్స్టిన్ జాక్ పాల్ నిర్మాత. సుశీల్ కుమార్ అగర్వాల్, నితిన్ కుమార్, రజత్ అగర్వాల్ సహా నిర్మాతలు.
బ్లాడ్ రిలేషన్స్ తో కూడిన ఎమోషన్స్ జర్నీ అంథోని. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి ఆదరణ లభించింది. అంథోని సినిమా ప్రపంచవ్యాప్తంగా మలయాళం, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నవంబర్ 23న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా హీరో జోజు జార్జ్ మాట్లాడుతూ… ” గతంలో నేను ఈ చిత్ర దర్శకుడు జోషి దర్శకత్వంలో వచ్చిన పోరింజు మరియం జోష్ నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది. అంథోని సినిమా కూడా అదే తరహాలో విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.
ఈ సినిమాకు జెక్స్ బీజాయ్ సంగీతం అందించగా రెనాడివ్ సినిమాటోగ్రఫీ అందించారు, అలాగే శ్యామ్ శశిధరన్ ఎడిటర్ గా వ్యాహరించిన ఈ సినిమాకు ఆర్జె శాన్ క్రియేటివ్ హెడ్ గా ఉన్నారు అలాగే మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ సంగీత జనచంద్రన్.