లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న పాతికవేల కుటుంబాలకు సాయం అందించాలని మంచు మనోజ్ నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నా పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సహాయ కార్యక్రమాలు ప్రారంభించాం. నేను, నా అభిమానులు, మిత్రులు కలసి భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. కరోనా ఉధృతి ఉంది.
కనుక దయచేసి అందరూ ఇళ్లల్లో ఉండి… మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుందాం. తమ జీవితాల్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి కృతజ్ఞతలు’’ అని అన్నారు.