ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తనను గతంలో తప్పించడంపై కీలక వ్యాఖ్యలు నుంచి చేశాడు. ‘నేను 400వ టెస్ట్ వికెట్ తీసినప్పుడు నాకు 31 ఏళ్లు.
తర్వాత మరో వంద వికెట్లు తీస్తానని భావించా. కానీ 2016 తర్వాత నన్ను జట్టులోకి తీసుకోలేదు. ఇదే విషయమై ధోనీని అసలు ఏం జరిగింది. నేను టీంలో ఉండటం ఎవరికి ఇష్టంలేదు? అని అడిగా. కానీ ధోనీ సమాధానం ఇవ్వలేదు’ అని భజ్జీ అన్నాడు.