తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందన్నారు. క్లౌడ్ బరస్ట్‌పై ఏదో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారు. కుట్రలు ఎంత వరకు నిజమో తెలియదు. ఇతర దేశాల వాళ్లు కావాలని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో లడాఖ్, లేహ్, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
