బజర్దస్త్ షో అందరినీ అలరిస్తోందని, కానీ కొతమంది పనికట్టుకొని మరీ జబర్దస్త్ బూత్ షో అంటూ ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలానే చేస్తే ఆ షో చేయడం మానేస్తానంటూ బాంబ్ పేల్చారు నటి, ఎమ్మెల్యే రోజా. అయితే, గతంలో టీవీ షోలలో సంసారం పేరిట రక రకాల షోలు చేస్తున్నారని కలహాల కాపురాలను సరిదిద్దాల్సిందిపోయి మరింత వేడి రాజేసి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారని పెద్ద ఎత్తున రోజాపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో సారి జబర్దస్త్‌పై వస్తున్న విమర్శలపై మీడియాతో స్పందించారు రోజా.
ప్రస్తుతం టీవీ షోలలో మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్న జబర్దస్త్‌పై బూతు షో అంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. జబర్దస్త్‌కు టాప్ రేటింగ్ రావడం చూసిన పలు మీడియా సంస్థలు.. జబర్దస్త్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వారు ఇలాగే విమర్శలు చేస్తే తాను జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటానని, అప్పుడు వారి కళ్లు చల్లబడతాయని పేర్కొన్నారు రోజా.