తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు.. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు.ఆ పార్టీ సీనియర్ నేత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ” నాకు పార్టీలో ఎవరూ సహాకరించడంలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన నేతలకు.. కార్యకర్తలకు సమయం కేటాయించలేకపోతున్నాను. పార్టీలోసం.. పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు కష్టపడుతున్నా నాపై అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఆరోపణలు.. విమర్శలు చేస్తున్నా కానీ ఎవరు తిప్పికొట్టడం లేదు.
నేను టీపీసీసీ పదవీ నుండి తప్పుకుంటాను “అని ఆయన ప్రకటించారు. అయితే కొంతకాలంగా టీపీసీసీ అధ్యక్షుడ్ని మారుస్తారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే. మరోవైపు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు వీహెచ్,కోమటిరెడ్డి బ్రదర్స్,రేవంత్ రెడ్డి,విక్రమార్క భట్టి,పొన్నం ప్రభాకర్ తదితరులాంటి నేతలు మొదటి నుండి ఉత్తమ్ నుతప్పించాలని చూస్తున్న తరుణంలో తాజాగా ఉత్తమ్ స్వయంగా ప్రకటించడంతో వీళ్లు ఆనందంలో ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.